epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

డిఫరెంట్ జోనర్​లో నాగ్ 100 మూవీ!

కలం, సినిమా : టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) కెరీర్ లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా (King 100) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీని ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు. ఈ సినిమా జోనర్ ఏంటి అనేది కూడా బయటకు రాలేదు. పొలిటికల్ టచ్ ఉంటుందని ఓసారి ప్రచారం జరిగితే.. నాగార్జునకు కలిసొచ్చిన రొమాంటిక్ జోనర్ అని మరోసారి ప్రచారం జరిగింది. ఇలా ప్రచారాలు.. గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ.. అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఇందులో నాగార్జున మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడట. అలాగే సీనియర్ హీరోయిన్ టబు నటిస్తుందని తెలిసింది. ఇద్దరు యంగ్ హీరోయిన్స్ నటిస్తున్నారట. అయితే.. సుస్మిత భట్ అనే హీరోయిన్ ని తీసుకున్నారు. ఈమె తెలుగులో నాట్యం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది. కాంటెంపరరీ ఇష్యూ తీసుకుని దాని చుట్టూ కథ అల్లారట. ఈ కథ చాలా కొత్తగా ఉంటుందని.. ఈ కథ కోసం చాన్నాళ్లు కసరత్తు జరిగిందని టాక్ వినిపిస్తోంది.

ఇది నాగ్ 100వ (King 100) సినిమా కాబట్టి ఇందులో నాగచైతన్య, అఖిల్ గెస్ట్ అప్పీరెన్సులు ఉంటాయని తెలిసింది. ఈ సినిమా విషయంలో నాగ్ చాలా కేర్ తీసుకుంటున్నారు. కార్తీక్ తమిళ్ లో ఒక సినిమా మాత్రమే చేశాడు. పైగా ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు. అయినప్పటికీ.. అతని టాలెంట్ పై నమ్మకంతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇటీవల నాగ్ తో పాటు ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే.. మేలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ.. దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని టాక్.

Read Also: కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవికి చిన్మయి కౌంటర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>