కలం, సినిమా : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ).. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్ డమ్.. ఇలా వరుసగా ప్లాపులు ఇవ్వడంతో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. సరైన బ్లాక్ బస్టర్ తో ఫామ్ లోకి రావాలని తపిస్తున్నాడు. ఇప్పుడు రెండు సినిమాలను ఒకేసారి చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల పై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే.. ఈ సినిమాలను 4 నెలల గ్యాప్ లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతుందని తెలిసింది. ఇంతకీ.. విజయ్ రెండు సినిమాలు రిలీజ్ ఎప్పుడు..?
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ఓ భారీ పీరియాడిక్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా టైటిల్ రణబలి అని అనౌన్స్ చేశారు. ఈ గ్లింప్స్ లో కథ ఏంటి అనేది చెప్పేశారు. ఇందులో విజయ్ కు జంటగా రష్మిక (Rashmika Mandanna) నటిస్తుంది. బ్రిటీష్ కాలం నాటి కథ ఇది. అప్పటి బ్రిటీష్ అధికారుల దౌర్జన్యాలు, వాటి పై పోరాటం చేసిన ఓ సామాన్యుడు కథగా చూపించబోతున్నారని తెలుస్తోంది. మన దేశ సంపదని తరలించడానికి బ్రిటీషర్లు అప్పట్లో రైల్వే లైన్లు విరివిగా వేయించారు. ఆ కథలో.. ఆ అంశం కూడా బాగా మిళితం చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
విజయ్ చేస్తోన్న మరో సినిమా రౌడీ జనార్ధన (Rowdy Janardhana). ఈ సినిమాకి రవికిరణ్ కోలా డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రక్తపాతం మామూలుగా లేదు. ఓ రేంజ్ లో ఉంది. ఇప్పుడు హింస ఎక్కువుగా చూపిస్తున్న సినిమాలు ఎక్కువుగా చూస్తున్నారని ట్రెండ్ ఫాలో అవుతున్నారమో అనే టాక్ వినిపిస్తుంది. ఇందులో విజయ్ (Vijay Deverakonda) క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా, కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే.. రణబలి (Ranabaali) సెప్టెంబర్ లో రిలీజైన నాలుగు ఎలల గ్యాప్ లోనే రౌడీ జనార్థన రాబోతోంది. ఈ రెండు సినిమాలు విజయ్ కి కీలకం. మరి.. ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.
Read Also: కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవికి చిన్మయి కౌంటర్
Follow Us On: Sharechat


