epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

బ్రంట్​ సెంచరీ.. ప్లేఆఫ్​ రేసులోనే ముంబై

కలం, వెబ్​డెస్క్​: మహిళల ప్రీమియర్​ లీగ్​లో రెండు సార్లు ఛాంపియన్​ ముంబై (Mumbai Indians Women) ప్లేఆఫ్​ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. సోమవారం వడోదరలోని బీసీఏ స్టేడియంలో ఆర్​సీబీతో జరిగిన మ్యాచ్​లో 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. నాథన్​ సీవియర్​ బ్రంట్​ అజేయ సెంచరీ (100 నాటౌట్​; 57 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్​)కి తోడు, ఓపెనర్​ హీలీ మ్యాథ్యూస్​(56; 39 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించారు. డబ్ల్యూపీఎల్​లో నమోదైన తొలి సెంచరీ ఇదే కావడం విశేషం. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు బౌలర్లలో లారెన్​ బెల్​ 2 వికెట్లు తీయగా, నదిన్​ డి క్లెర్క్​, శ్రేయాంక పాటిల్​ చెరో వికెట్​ పడగొట్టారు.

ఛేదనలో ఆర్​సీబీ తడబడింది. 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్​ స్మృతి మంధాన(15) మరోసారి తక్కువ స్కోరుకే అవుటైంది. రిచా ఘోష్​ (90; 50 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్​లు​) చివరి వరకూ పోరాడినప్పటికీ మిగిలినవాళ్లు నిలవలేకపోయారు. దీంతో ఆ జట్టు చివరికి 184 పరుగులకు పరిమితమై పరాజయం పాలైంది. ముంబై బౌలర్లలో హీలీ మ్యాథ్యూస్​ 3, షబ్నిమ్​ ఇస్మాయిల్​, అమెలియా కెర్​ చెరో రెండు వికెట్లు తీశారు. అమన్​జ్యోత్ కౌర్​కు 1 వికెట్​ దక్కింది. కాగా, ఏడు మ్యాచ్​ల్లో 3 విజయాలతో ముంబై (Mumbai Indians Women) జట్టు సాంకేతికంగా ప్లేఆఫ్​ రేసులో నిలిచింది.

Read Also: పరుగులు రాకపోయినా సంజూనే కొనసాగించాలి: రహానే

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>