కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ విచారణ మొత్తం అట్టర్ ఫ్లాప్ టీవీ సీరియల్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ నోటీసులివ్వడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. టీవీ సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోందని, అసలైన బాధ్యులైన అధికారులను వదిలేసి, కేసుతో సంబంధం లేని ప్రతిపక్ష నాయకులను పిలవడం రాజకీయ కక్ష సాధింపు అన్నారు. అటెన్షన్ డైవర్షన్‌లో భాగమేనని, మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. విచారణ పేరుతో కాంగ్రెస్ (Congress) డ్రామాలు ఆడుతోంది కేటీఆర్ విమర్శించారు.
Read Also: భారత్ తో అమెరికాది చరిత్రాత్మక బంధం : డొనాల్డ్ ట్రంప్
Follow Us On: Instagram


