కలం, ఖమ్మం బ్యూరో : రాబోయే రోజుల్లో ఏదులాపురం (Yedulapuram) మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన (రోల్ మోడల్) మున్సిపాలిటీగా తీర్చుదిద్దడమే తన లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సి.సి. రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి (Minister Ponguleti) కోట నారాయణపురంలో రూ. 22.6 లక్షలతో సి.సి. డ్రైను నిర్మాణానికి, ఎస్సీ బీసీ కాలనీలో రూ. 72 లక్షల వ్యయంతో అంతర్గత సి.సి. రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గుదిమళ్ళలో రూ. 44.55 లక్షలతో, ఇందిరమ్మ కాలనీ-1లో రూ. 75.85 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. వీటితో పాటు నంద్యాతండాలో రూ. 26.55 లక్షల వ్యయంతో డ్రైన్లు, జంగాల కాలనీలో రూ. 14.10 లక్షలతో సి.సి. రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
Read Also: ఆ నలుగురు మంత్రుల కీలక భేటీ.. ‘ఎట్ హోమ్’ నుంచి ఒకే కారులో
Follow Us On: Instagram


