కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వ్యాపారులు తమ ఉత్పత్తులు, బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంటున్నారు. దీనిద్వారా వ్యాపారులు కస్టమర్లను ఆకర్షిస్తూ లాభాలు పొందుతున్నారు. కొందరు ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తూ ఇబ్బందులపాలవుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారి ‘రూ.26 వేలకే కారు‘ (Car Offer) అంటూ ప్రచారం చేసి పోలీసుల ఆగ్రహానికి గురయ్యాడు.
మేడ్చల్ మల్కాజిగిరి (Medchal-Malkajgiri) జిల్లా మల్లాపూర్‌కు చెందిన రోషన్ అనే పాత కార్ల వ్యాపారి రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26 వేలకే కారు ఇస్తున్నట్లు ప్రచారం చేశాడు. తన వద్ద ఉన్న 50 కార్లను కేవలం రూ.26 వేలకే అమ్ముతున్నట్లు ప్రకటించాడు. వీడియో చూసి షాపు వద్దకు జనం భారీగా తరలివచ్చారు. అయితే తన వద్ద 10 కార్లే ఉన్నాయని చెప్పడంతో కస్టమర్లు ఆగ్రహానికి గురై వ్యాపారి రోషన్ పై దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కార్ల వ్యాపారి రోషన్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి ప్రజలు మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: 30% సూసైడ్స్.. IIT కాన్పూర్ లో ఏం జరుగుతోంది?
Follow Us On: Instagram


