epaper
Monday, January 26, 2026
spot_img
epaper

రూ.400కోట్ల డబ్బున్న కంటైనర్​ అపహరణ.. తిరుపతి లింక్​!

కలం, వెబ్​డెస్క్​: విదేశాల్లో తరచూ జరిగే మనీహీస్ట్​ను తలపించేలా దేశంలో అతిపెద్ద దోపిడీ జరిగింది. రూ.400కోట్ల డబ్బు ఉన్న కంటైనర్​ (Cash Container Heist) ను అపహరించారు. కర్ణాటక–గోవా సరిహద్దులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై మహారాష్ట్రలోని నాసిక్​లో (Nashik) కేసు నమోదు కాగా, ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. సంచలనం కలిగిస్తున్న ఈ దోపిడీ వివరాలు..

సయ్యద్​ అజార్​, విరాట్​ గాంధీ, మచ్చీంద్ర మాధవి అనే ముగ్గురు వ్యక్తులు తమ వద్ద రూ.400కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు ఉన్నాయని, వాటిని తీసుకొని తమకు కొంత డబ్బువ్వాలని ఓ బిల్డర్​ను సంప్రదించారు. ఆ నోట్లను అప్పటికే భారత ప్రభుత్వం మార్కెట్​ నుంచి విరమించుకోవడంతో వీటిని ఎలాగైనా మార్చుకోవాలని వాళ్లు అనుకున్నారు. అదంత సులువు కాకపోవడంతో, ఇలాంటి వ్యవహారాల్లో పేరున్న బిల్డర్​ను కలిశారు.

వాళ్ల ప్రతిపాదనకు అంగీకరించిన ఆ బిల్డర్​ కొంత డబ్బును వాళ్లకు ముందుగానే ఇచ్చాడు. అయితే,  ఆ తర్వాత డబ్బు ఉన్న కంటైనర్​ను సందీప్​ పాటిల్ (35)​ అనే వ్యక్తి అపహరించినట్లు బిల్డర్​కు వాళ్లు చెప్పారు. దీంతో బిల్డర్​ పంపిన మనుషులు సందీప్​ను కిడ్నాప్​ చేశారు. కంటైనర్​ తమకు అప్పగించాలని చిత్రహింసలు పెట్టి, వదిలేశారు. అనంతరం సందీప్​ నేరుగా నాసిక్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అజార్​, విరాట్​, మాధవి తోపాటు సందీప్​ దాడికి పాల్పడిన మరో ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు.

రాజకీయ వివాదం..

రూ.400కోట్ల కంటైనర్​ దోపిడీ (Cash Container Heist) వ్యవహారం రాజకీయ వివాదం తీసుకుంది. ఈ కంటైనర్ మహారాష్ట్ర నుంచి గోవా, కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతికి చేరాల్సి ఉంది. అయితే, మార్గమధ్యంలో గోవా–కర్ణాటక సరిహద్దులోని చర్లకొండ రూట్​లో బెలగావికి వస్తుండగా అపహరణకు గురైంది. ఇది గతేడాది అక్టోబర్​ 22న జరగ్గా,  సందీప్​ పాటిల్​ ఫిర్యాదుతో ఇటీవల ​బయటపడింది.

కాగా, దోపిడీ ఘటనలో కర్ణాటక కాంగ్రెస్​, బీజేపీ పరస్పరం ఆరోపణలకు దిగాయి. కొన్ని రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్​ ఈ డబ్బు తరలిస్తోందని బీజేపీ ఆరోపించింది. దీని వెనక కాంగ్రెస్​ అధినేత మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్​ ఖర్గే ఉన్నారంది. ఈ ఆరోపణలను ప్రియాంక్​ ఖర్గేతోపాటు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర, మంత్రి జార్కి హోలీ ఖండించారు. కేసు నాసిక్​లో నమోదైందని, మహారాష్ట్ర సిట్​ దర్యాప్తు జరుపుతోందంటూ.. మహారాష్ట్ర, గోవాలో ఏ పార్టీ అధికారంలో ఉందో తెలుసుకోవాలన్నారు. అంతేకాదు, ఈ కంటైనర్​ తిరుపతికి వెళుతోందంటున్నారు కాబట్టి అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉందో కూడా చూడాలన్నారు. కేసును తమకు అప్పగిస్తే దర్యాప్తు చేసి అసలు దోషులను బయటపెడతామంటూ సవాల్​ విసురుతున్నారు. కాగా, రూ.400కోట్ల కంటైనర్​ దోపిడీ వ్యవహారంలో తిరుపతి పేరు వినిపించడంపై తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ నడుస్తోంది.

Read Also: పెంగ్విన్ ఓపికకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>