కలం, వెబ్ డెస్క్: లైంగిక వేధింపుల కేసులో ‘ధురంధర్’ (Dhurandhar) నటుడు నదీమ్ ఖాన్(Nadeem Khan)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నదీమ్ ఖాన్ తనపై పదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారని అతడి ఇంటి పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, ఇప్పుడు పెళ్లి గురించి ప్రస్తావిస్తే అందుకు ఒప్పుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. నదీమ్ పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో ఈ విషయాన్ని ఇంతకాలం బయటపెట్టలేదని సదరు మహిళ చెప్పిది. ముందుగా ఆమె మాల్వాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసును వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం నదీమ్ వెర్సోవా పోలీసుల కస్టడీలో ఉన్నారు. జనవరి 22న నదీమ్ ఖాన్‌ను అరెస్ట్ చేయగా పోలీసులు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Also: క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్..!
Follow Us On: Pinterest


