కలం, మెదక్ బ్యూరో: జై హింద్ నినాదాలు చేయవలసిన చోట.. జై కాంగ్రెస్(Congress) అంటే జై బీఆర్ఎస్(BRS) అంటూ రాజకీయ నేతలు పోటా పోటీ నినాదాలు చేసుకొని పరిస్థితిని ఉద్రిక్తతంగా మార్చారు. మున్సిపల్ ఎన్నికల వేళ గణతంత్ర దినోత్సవ వేడుకల వద్ద అధికార, ప్రతిపక్ష పార్టీల బల ప్రదర్శనతో బాహాబాహీకి దిగిన సంఘటన సిద్ధిపేట జిల్లా దుబ్బాక(Dubbak )పట్టణంలో జరిగింది. దుబ్బాకలోని గాంధీ చౌక్ వద్ద స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) జాతీయ జెండాను ఎగురవేశారు. మొదట జాతీయ జెండా తలక్రిందులు కాగా, తిరిగి జెండాను సరిచేసి ఎగురవేశారు. ఎమ్మెల్యే ప్రసంగం సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మర్చిపోయి పార్టీల వారీగా విడిపోయి ఇరువర్గాల వారు తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి శాంతింపజేశారు. మరోవైపు గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసి, పీఎస్ ఎదుట నిరసన తెలిపారు.
Read Also: రిపబ్లిక్ డే వేడుకల్లో మంత్రి.. విరిగిన జెండా కర్ర
Follow Us On : WhatsApp


