epaper
Monday, January 26, 2026
spot_img
epaper

క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్..!

క‌లం, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) మ‌రోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అప్పుడ‌ప్పుడూ హీరోయిన్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు క్యాస్టింగ్ కౌచ్ గురించి గ‌ళం విప్పేవారు. కానీ, ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడ‌టం సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపింది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం మ‌న వ‌ర‌శంక‌ర‌ప్ర‌సాద్ గారూ (MSVPG) ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లైంది. ఈ సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా విజ‌యోత్స‌వ వేడుక‌ను ఆదివారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చిరంజీవి ఇండ‌స్ట్రీకి వ‌చ్చే కొత్త వాళ్ల గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.

చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ ఇది గొప్ప ఇండ‌స్ట్రీ అని, ఇక్క‌డ ఎవ‌రైనా రాణించ‌లేక‌పోయినా, ఎవ‌రికైనా చేదు అనుభ‌వం ఎదురైనా అది వాళ్ల త‌ప్పిద‌మేన‌ని అన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు స్ట్రిక్ట్‌గా ఉంటే ఎవ‌రూ అడ్వాంటేజ్ తీసుకోర‌ని, వాళ్ల బిహేవియ‌ర్‌ను బ‌ట్టే ఇక్క‌డ అన్నీ ఉంటాయ‌ని చెప్పారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చే వాళ్లు ప్రొఫెష‌న‌ల్‌గా ఉండాల‌ని, ఇండ‌స్ట్రీ ఒక అద్దం లాంటిద‌ని, ఇక్క‌డ‌ ఏమిస్తే అదే తిరిగి వస్తుంద‌ని అన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవ‌రైనా స‌రే హార్డ్ వ‌ర్క్‌ను న‌మ్ముకొని ఇండ‌స్ట్రీకి రావాలని కోరారు. ప్ర‌తి ఒక్క‌రూ కెరీర్ విష‌యంలో సీరియ‌స్‌గా ఉండాల‌ని, అభ‌ద్ర‌తా భావంతో ఏదేదో ఊహించుకోవ‌ద్ద‌ని సూచించారు. మెగాస్టార్ వ్యాఖ్య‌ల‌తో ఫిల్మ్ ఇండ‌స్ట్రీ (Film Industry)లో క్యాస్టింగ్ కౌచ్ గురించి మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది.

Read Also: VD14 : టైటిల్ రివీల్ పై బిగ్ అప్డేట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>