కలం, వెబ్ డెస్క్ : 2026 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను (Padma Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డులు వచ్చిన వారికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుడు నోరి దత్తాత్రేయుడుకు పద్మ విభూషణ్ అవార్డు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచి గడ్డ మణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్ అద్భుతమైన సేవలు అందించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అలాగే వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, పాల్కొండ విజయానంద్ రెడ్డి, పశుసంవర్థక రంగంలో మామిడి రామారెడ్డితో పాటు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు, సినిమా రంగంలో రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ లకు అవార్డులు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. వారు ఆయా రంగాల్లో చూపించిన అంకితభావం, సేవలకు ఈ గుర్తింపు దక్కినట్టు సీఎం రేవంత్ (Revanth Reddy) చెప్పారు.
Read Also: బంగారం భలే చౌక.. ఎక్కడంటే?
Follow Us On: Sharechat


