epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

ఎస్సైని కారుతో ఢీకొట్టిన మందుబాబులు.. బ్యానెట్ పై లాక్కెళ్లి..!

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో మందు బాబులు వీరంగం సృష్టించారు. యాచారంలో ఎస్సైని కారుతో ఢీకొట్టి దారుణానికి ఒడిగట్టారు. యాచారం పోలీస్ స్టేషన్ ఎస్సై మధు డ్రంకెన్ డ్రైవ్ విధుల్లో ఉండగా.. కారులో కొందరు మద్యం సేవించి వచ్చారు. కారును ఆపడానికి ఎస్సై ప్రయత్నించగా.. ఢీకొట్టారు. ఎస్సై మధు కారు బ్యానెట్ పై పడ్డా సరే ఆపకుండా కిలోమీటర్ వరకు ఈడ్చెకెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక కారు స్లో అవగానే బ్యానెట్ పై నుంచి ఎస్సై దూకేశారు. ఎస్సై మధుకు స్వల్పగాయాలు అయ్యాయి. మందుబాబులను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>