కలం, వరంగల్ బ్యూరో : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పై మండి పడ్డారు. మనవరాలు వయసు ఉన్న అమ్మాయి చేతిలో ఓడిపోయేసరికి ఎర్రబెల్లికి చిన్న మెదడు చితికిపోయి మతి బ్రమించి సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ఏద్దేవా చేశారు.
టిడిపిని హోల్ సేల్ గా కేసీఆర్ కు అమ్మిన నీచపు చరిత్ర ఆయనది అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి వెళ్ళడానికి ఎర్రబెల్లి ప్రయత్నాలు చేశాడు. ఆయన నీచపు చరిత్ర తెలిసి రేవంత్ రెడ్డి పార్టీలోకి రానివ్వలేదని అన్నారు. మనం మాట్లాడే సభ్యతను బట్టే ఎదుటి వారి సంస్కారం ఉంటుందని హితవు పలికారు. స్టేషన్ ఘనపూర్ కి బైపోల్ వస్తే తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కకుండా అప్పటి మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్ర పన్నారని ఎమ్మెల్యే కడియం (Kadiyam Srihari) తెలిపారు.
Read Also: 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ : మంత్రి ఉత్తమ్
Follow Us On: Sharechat


