కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెంలోని (Kothagudem) పురాతన గనిగా పేరుగాంచిన పీవీకే-5 అండర్ గ్రౌండ్ మైన్‌లోకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అధికారులతో కలిసి దిగారు. కార్మికులు ధరించే యూనిఫాం, తలకు హెల్మెట్ ధరించి కన్వేయర్ బెల్ట్ సహాయంతో గని లోపలికి వెళ్లారు. అక్కడ కార్మికులు పడుతున్న కష్టాన్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మైన్ ప్రొడక్షన్, అక్కడి పరిస్థితుల గురించి అధికారులు, కార్మికులతో మాట్లాడారు.
కొత్తగూడెంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన ఆదివారం రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణకే కాకుండా దేశానికే సింగరేణి గర్వకారణం అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రమాద రహితంగా ఉత్పత్తిని సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు.
ప్రధానంగా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి, అధిక ఉత్పత్తిని సాధించే దిశగా ముందడుగు వేస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: నల్లగొండలో మేయర్ మేనియా.. ఎవరికివారే బిజీ బిజీ
Follow Us On : WhatsApp


