epaper
Tuesday, November 18, 2025
epaper

ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు : చంద్రబాబు

ప్రభుత్వ పథకాల అమలు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఎమ్మెల్యే కచ్చితంగా పింఛన్ల పంపిణీలో పాల్గొనాల్సిందేనని ఆయన ఆదేశించారు. అయితే టీడీపీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. శనివారం పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక భద్రతా పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలపై నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు.

వివరణ అడిగిన తర్వాత కొనసాగితే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేసి, పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ చిన్న అంశానికి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు నాయుడు(Chandrababu) అలర్ట్ అయ్యారు. చేసిన మంచిని ప్రజలకు చెప్పుకోవాలని సూచించారు.

ఇక క్రమశిక్షణ విషయంలో చంద్రబాబు నాయుడు కఠినంగా ఉంటారన్న విషయం తెలిసిందే. అందుకే పార్టీ ఆదేశాలను పాటించని నేతలపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత, పార్టీ నేతల్లో కొంతమంది విజయోత్సాహంలో పడిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read Also: అత్తను చంపిన కోడలు.. యూట్యూబ్ చూసి స్కెచ్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>