epaper
Tuesday, November 18, 2025
epaper

రేపటినుంచి జూబ్లీహిల్స్‌లో ఆంక్షలు

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll) నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌(CP Sajjanar) కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు సమయంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పలు ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. సీపీ ప్రకటన ప్రకారం, నవంబర్‌ 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు, అలాగే ఓట్ల లెక్కింపు జరిగే నవంబర్‌ 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

నియోజకవర్గ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశించారు. అదనంగా, పోలింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించిన వ్యక్తులు గుమిగూడడం నిషేధించబడింది.

శాంతిభద్రతల దృష్ట్యా నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని సజ్జనార్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో టపాసులు పేల్చడం, వేడుకలు నిర్వహించడం నిషేధమని హెచ్చరించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ(CP Sajjanar) స్పష్టం చేశారు.

Read Also: మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్‌

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>