కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ఈ సంక్రాంతికి సాలిడ్ హిట్ అందుకున్నాడు. “అనగనగా ఒక రాజు” (Anaganaga Oka Raju) సినిమాతో ఈ సంక్రాంతి బరిలో నిలిచిన నవీన్ పోలిశెట్టి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాడు. యంగ్ డైరెక్టర్ మారి (Maari) దర్శకత్వంలో వచ్చిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ మీనాక్షీ చౌదరి (Meenaakshi Chaudhary) నవీన్ సరసన హీరోయిన్ గా నటించింది.
అదరిపోయే కలెక్షన్స్‌తో రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్లో సైతం ఈ మూవీ దూసుకుపోతుంది. తాజాగా అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) మూవీ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1.7 మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. రాజు గారి రాయల్ కలెక్షన్స్ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.
Read Also: విజయ్ దేవరకొండ , రాహుల్ సాంకృత్యాన్ మూవీ బిగ్ అప్డేట్..
Follow Us On : WhatsApp


