epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

ఆన్​లైన్​ లో ఆర్డర్ పెడుతున్నారా..? రేపు కష్టమే

కలం, వెబ్​ డెస్క్​ : ఆన్ లైన్ లో వస్తువులు, ఫుడ్​ ఆర్డర్​ చేస్తున్నారా? అయితే, మీకు బ్యాడ్​ న్యూస్ అనే చెప్పాలి​. రేపు ఆన్​ లైన్​ డెలివరి యాప్​ లు బంద్​ కానున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం గిగ్ వర్కర్లు సోమవారం దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనకు (Gig Workers Strike) దిగనున్నట్లు ప్రకటించారు. ఆన్​ లైన్ యాప్​ లు ఆఫ్​ చేసి నిరసన తెలపనున్నారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కారణం లేకుండా ఐడీ బ్లాక్​ చేయడం, రేటింగ్, ఆటో సైన్​ ఆఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. వేతనాల పెంచాలని, ముందస్తు కటింగ్ చేయొద్దని కోరుతున్నారు. ఫిబ్రవరి 3న ఆఫ్​ లైన్ ధర్నాకు గిగ్ వర్కర్ల సంఘం పిలుపునిచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>