కలం, సినిమా : ఇండస్ట్రీలో ఒక హీరో కోసం కథ రాస్తే.. మరో హీరోతో సెట్ అవ్వడం అనేది కామన్. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని ట్రై చేస్తే.. కండల వీరుడు సల్మాన్ (Salman Khan) తో సెట్ అయ్యిందని.. టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. అమీర్ తో సినిమా చేయాలని ట్రై చేసిన ఆ డైరెక్టర్ ఎవరు..? అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..?
వంశీ పైడిపల్లి.. మున్నా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై.. తొలి సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారసుడు చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అయితే.. వంశీ స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అవ్వడం వలన కెరీర్ లో సినిమా సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు.. నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కోలీవుడ్ స్టార్ విజయ్ తో వారసుడు సినిమా చేసిన తర్వాత ఇంత వరకు వంశీ పైడిపల్లి కొత్త సినిమా ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్ అమీర్ తో సినిమా చేయాలని గత కొంతకాలంగా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఓ సంవత్సరం పాటు అమీర్ తో వంశీ (Vamshi Paidipally) ట్రావెల్ అయ్యాడు కానీ.. వర్కవుట్ కాలేదు. అమీర్ కోసం రాసిన స్టోరీని కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు చెబితే ఎస్ చెప్పాడట. ఇది మాస్ ఎంటర్ టైనర్ అని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. ఫిబ్రవరిలో ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని టాక్. ఈ క్రేజీ కాంబో మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. దిల్ రాజు బాలీవుడ్ లో హిట్, జెర్సీ సినిమాలను రీమేక్ చేశారు కానీ.. వర్కవుట్ కాలేదు. ఇప్పుడు బాలీవుడ్ పై మళ్లీ ఫోకస్ పెట్టాడని సమాచారం. మరి.. సల్మాన్ – వంశీ కాంబోలో రూపొందే సినిమాతో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.
Read Also: విజయ్ దేవరకొండ , రాహుల్ సంకృత్యాన్ మూవీ బిగ్ అప్డేట్..
Follow Us On: Sharechat


