epaper
Monday, March 2, 2026
epaper

కశ్మీర్‌లో ఆపరేషన్ పింపుల్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదులపై భారత భద్రతాదళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇందులో భాగంగానే జమ్మూకశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో ఆపరేషన్ పింపుల్‌(Operation Pimple)ను ప్రారంభించాయి. కుప్వాడా జిల్లాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది ఆపరేషన్ చేపట్టారు. నగరమంతా జల్లెడపట్టడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల, భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు భారత సైన్యానికి చెందిన చినార్ కోర్ వెల్లడించారు. ‘‘ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. అందుకే శుక్రవారం ఆపరేషన్ పింపుల్(Operation Pimple) స్టార్ట్ చేశాం. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతన్నాయి’’ అని చెప్పారు. ఆపరేషన్ పింపుల్‌తో పాటు ఆపరేషన్ ఛత్రు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Read Also: ఓ పార్టీ 2 వేలు.. ఇంకోపార్టీ 3 వేలు?

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!