కలం, సినిమా : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) భారీ సక్సెస్ చూసి చాలా కాలమే అయింది. విజయ్ గతంలో నటించిన ‘కింగ్డమ్’ (Kingdom) మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో “రౌడీ జనార్ధన” అనే మూవీ చేస్తున్నాడు. ఇటీవల ఆ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) డైరక్షన్‌లో విజయ్ బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. “VD14” వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీలో విజయ్ (Vijay Deverakonda) ఓ యోధుడిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ రోజు ఈ సినిమా టైటిల్ రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Read Also: అమీర్ తో అనుకుంటే.. సల్మాన్ తో సెట్ అయిందా?
Follow Us On : WhatsApp


