కలం, వెబ్ డెస్క్ : ఐసీసీ పురుషుల టి20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) కు ముందు ఆస్ట్రేలియా (Australia) ను వరుస గాయాలు కుంగదీస్తున్నాయి. తాజాగా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎలిస్ (Nathan Ellis) గాయపడటం జట్టులో ఆందోళనను పెంచింది. శ్రీలంక, భారత్ వేదికలుగా వచ్చే నెల ప్రారంభమయ్యే మెగా టోర్నీకి ముందు ఇది కీలక పరిణామంగా మారింది.
బీబీఎల్ 15 (BBL 15) లో హోబార్ట్ హరికేన్స్ (Hobart Hurricanes) కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఎలిస్, సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఛాలెంజర్ మ్యాచ్ నుంచి చివరి క్షణంలో తప్పుకున్నాడు. అంతకుముందు మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌కు కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో ప్రపంచకప్‌లో అతని భాగస్వామ్యం అనుమానంగానే ఉంది.
ఇప్పటికే జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ పర్యవేక్షణలో కొనసాగుతున్నారు. మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్ కూడా గాయాల నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ పర్యటన ఆస్ట్రేలియా (Australia) సన్నాహకాలకు కీలకంగా మారనుంది.
Read Also: బంగ్లాదేశ్‌కు ఐసీసీకి షాక్.. T20 వరల్డ్ కప్ నుంచి ఔట్
Follow Us On: Sharechat


