epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

స్పిరిట్ నుంచి క్రేజీ అప్డేట్..!

క‌లం, వెబ్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్ (Spirit). ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ సినిమా కాబట్టి స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయ్యింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం మూవీ టీమ్ సన్నాహాలు ప్రారంభించారు. డెహ్రడూన్‌లో ఈ షెడ్యూల్ చిత్రీకరణ చేయబోతున్నారు. ఈ లెంగ్తీ షెడ్యూల్ లో ప్రభాస్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను రూపొందించనున్నారు.

టి సిరీస్ సంస్థతో కలిసి సందీప్ వంగా, ఆయన సోదరుడు ప్రణయ్ వంగా స్పిరిట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిప్తీ డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా స్పిరిట్ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు హీరో గోపీచంద్ ను అప్రోచ్ అయ్యారట దర్శకుడు సందీప్ వంగా. గోపీచంద్ (Gopichand) చేసేది హీరోకు ఫ్రెండ్ పాత్రనా, లేక విలన్ గానా అనేది తెలియాల్సిఉంది.

విలన్ గా నటిస్తే.. గోపీచంద్ కెరీర్ లో మరో ఇన్నింగ్స్ మొదలైనట్లే అనుకోవాలి. ప్రభాస్ హీరోగా, గోపీచంద్ విలన్ గా వర్షం సినిమాలో నటించారు. అది సూపర్ హిట్ అయ్యింది. హీరోగా కెరీర్ కొనసాగిస్తున్న గోపీచంద్ విలన్ గా ఒప్పుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా నుంచి న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ అయ్యింది. ఈ సినిమా మేకింగ్ కూడా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Read Also: చిరంజీవి సినిమాకు బిగ్​ షాక్​​.. రూ. 42 కోట్ల టికెట్​ వసూళ్లపై హైకోర్టులో పిటిషన్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>