epaper
Monday, March 2, 2026
epaper

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్‌ విమానాశ్రయం(Shamshabad Airport)లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వియత్నాం ఎయిర్‌లైన్స్‌కు చెందిన వీఎన్‌–984 విమానం సాంకేతిక లోపంతో రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో సుమారు 200 మంది ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. ఈ సందర్భంగా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సరైన సమాచారం ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

అనేక సర్వీసులు ఆలస్యం

ఇక కౌలాలంపూర్‌ వెళ్లాల్సిన మరో విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడంతో అది నిర్దేశిత సమయానికి 6 గంటల ఆలస్యంగా బయలుదేరింది. దిల్లీలో ఏర్పడిన ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) సమస్య కారణంగా ఢిల్లీ, ముంబయి, శివమొగ్గలకు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. గోవా వెళ్లాల్సిన సర్వీసు కూడా ఆలస్యంగా నడిచింది. ఈ పరిణామాలతో శంషాబాద్‌ విమానాశ్రయం(Shamshabad Airport)లో రాత్రంతా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read Also: టార్గెట్ హిడ్మా.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కోసం ముమ్మర గాలింపు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!