కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా గార్ల మండలంలో విషాదం నెలకొంది. ట్రాలీ నుంచి మార్బుల్స్ దించుతుండగా జారిపడడంతో ఇద్దరు మృతి చెందారు. బంగ్లా తండాకు చెందిన తరుణ్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన అవినాష్ (27)ను గార్ల ప్రభుత్వాసుత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. కాగా, అవినాష్ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నెమరిపురి వాసిగా గుర్తించారు.
Read Also: టీ హబ్‌లో ప్రభుత్వ ఆఫీసులు.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)


