కలం, వెబ్ డెస్క్: అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రసాదం (Annavaram Prasadam) బుట్టల్లో ఎలుకలు తిరగడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది. ఆలయం సమీపంలోని బస్టాండ్ వద్ద ఉన్న ప్రసాదం కౌంటర్లో ఈ ఘటన జరిగింది. భక్తులు ప్రసాదం కొనుగోలు చేసేందుకు వెళ్లగా ప్రసాదం బుట్టలపై ఎలుకలు తిరగడం గమనించారు అవి ప్రసాదాన్ని తింటూ అక్కడే తిరుగుతున్నాయి. ఇదే ప్రసాదాన్ని భక్తులకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై భక్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంటే కొనండి లేదంటే వెళ్లిపోండి.. అంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
ప్రసాదం బుట్టలపై ఎలుకలు తిరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో ఇక్కడే ప్రసాదంలో బొద్దింక రావడం కూడా తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై ఆలయ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రసాదం (Annavaram Prasadam) విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుక.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ
Follow Us On: Pinterest


