కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. మార్కాపురం నియోజకవర్గంలోని కొనకమిట్ల మండలం చిన్నారికట్ల వద్ద ఈ ప్రమాదం (Markapuram Accident) జరిగింది. ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో విజయవాడ నుంచి కనిగిరికి బయలుదేరింది.
శనివారం ఉదయం చిన్నారికట్ల వద్ద బస్సు ఆగి ఉన్న మినీ లారీని ఢీకొట్టింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ఒక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: అన్నవరం ప్రసాదం బుట్టల్లో ఎలుకలు.. భక్తుల ఆగ్రహం
Follow Us On: Sharechat


