కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) రాష్ట్ర ప్రభుత్వం సిట్ (SIT) పేరుతో టైంపాస్ చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. సిట్ అధికారులకు స్వేచ్ఛ లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే సిట్ పని చేస్తుందని ఆరోపించారు. శుక్రవారం బండి సంజయ్ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని బండి విమర్శించారు. రోజుల తరబడి సిట్ విచారణ కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే ఎంతోమంది అధికారులను, నేతలను ఈ కేసులో విచారించారని.. ఇప్పుడేమో కేసీఆర్ (KCR) సుపుత్రుడిని సిట్ విచారణకు పిలిపించిందని.. ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని పేర్కొన్నారు.
Read Also: జనగణనలో ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలివే..
Follow Us On: X(Twitter)


