కలం, మెదక్ బ్యూరో : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) కొద్దిసేపటి క్రితం సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కి చేరుకున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో ఆయన కీలక భేటీ అయ్యారు. కేటీఆర్ కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయినట్లు స్పష్టం అవుతోంది.
ఇదే కేసులో మంగళవారం విచారణ ఎదుర్కొన్న హరీష్ రావు (Harish Rao).. బుధవారం కేసీఆర్ తో భేటీ అయ్యారు. విచారణ వివరాలను కేసీఆర్ తో చర్చించారు. నేడు రెండోసారి ఇదే అంశంపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిరిసిల్ల టూర్ ముగిసిన అనంతరం కేటీఆర్ కూడా ఫార్మ్ హౌస్ కి చేరుకోనున్నారు. BRS అగ్రనేతల మధ్య ఎమర్జెన్సీ స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుతో పాటు రాజకీయ వ్యూహాలపై మంతనాలు జరపనున్నట్టు తెలుస్తోంది.
Read Also: మా మీద కాదు.. వాళ్ల మీద సిట్ వేయండి : కేటీఆర్
Follow Us On: Instagram


