epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

రాష్ట్రంలో సోషల్​ మీడియా బ్యాన్​! నారా లోకేశ్​ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ లో సోషల్​ మీడియాను నిషేధించడంపై (Social Media Ban) స్టడీ చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ (Davos) లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ​నారా లోకేశ్​ బ్లూమ్​బర్గ్​ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషధం (Social Media Ban) ఉందని, ఈ క్రమంలో ఏపీలో కూడా సామాజిక మాధ్యమాలను 16 ఏళ్లలోపు వారు వినియోగించకుండా నిషేధం విధించడంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఒక నిర్ధిష్ట వయస్సున్న వారు ఇలాంటి ప్లాట్​ ఫామ్ లో ఉండకూడదని.. వాటిల్లో వచ్చే కంటెంట్​ ను వారు అర్థం చేసుకోలేరని వెల్లడించారు. దీని కోసం ఒక బలమైన, చట్టపరమైన ఫ్రేమ్​ వర్క దిశగా తాము ఆలోచిస్తున్నామని లోకేశ్ తెలిపారు.

Read Also: ఆస్ట్రేలియాలో కాల్పులు.. ముగ్గురి మృతి..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>