కలం, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాలో (Australia) మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూ సౌత్ వేల్స్ లోని లేక్ కార్గెలిగో సిటీలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇంకొందరు గాయపడ్డట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో సిడ్నీలోని బాండీ బీచ్ లో తండ్రీ, కొడుకు కాల్పులు జరపగా 15 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రదాడికి నివాళిగా ఆస్ట్రేలియా జాతీయ సంతాప దినం పాటిస్తున్న రోజే ఈ కాల్పులు జరపడం సంచలనంగా మారింది. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ఆస్ట్రేలియా (Australia) పోలీసులు గాలిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు బయటకు రావొద్దంటూ పోలీసులు కోరారు. ఇది కూడా ఉగ్రదాడినా కాదా అన్నది తెలియాల్సి ఉంది.
Read Also: రాష్ట్రంలో సోషల్ మీడియా బ్యాన్!.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)


