కలం, వెబ్ డెస్క్: బిలియనీర్ వారసుడు అనంత్ అంబానీ (Anant Ambani) ప్రముఖ వాచ్‌మేకర్ జాకబ్ అండ్ కో తన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాచ్‌ను ధరించి వార్తల్లో నిలిచాడు. ‘వంతారా’ అని పేరు పెట్టిన ఈ వాచ్ అందర్నీ ఆకర్షిస్తోంది. దీని విలువ రూ.13 కోట్ల 74లక్షలకుపైగా ఉంది. ఈ గడియారం బంగారం, 397 విలువైన రత్నాలతో తయారైంది.
ఈ డిజైన్ అనంత్ అంబానీకి వన్యప్రాణులు, ప్రకృతి పరిరక్షణపై ఉన్న ప్రేమను తెలియజేస్తోంది. ఈ వాచ్‌లో అనంత్ అంబానీ (Anant Ambani) 3D బొమ్మ కూడా ఉంది. దాని చుట్టూ ఏనుగులు, ఖడ్గమృగాలు, పులులు తిరుగుతుంటాయి. సెలబ్రిటీలు, ప్రపంచ ప్రముఖుల కోసం జాకబ్ అండ్ కో ఖరీదైన వాచ్‌లను తయారీ చేస్తుంటుంది. ప్రత్యేకమైన డిజైన్‌తో తయారైన ‘వంతారా’ (Vantara) అత్యంత ఖరీదైన గడియారాల్లో ఒకటిగా నిలుస్తోంది.
Read Also: హైదరాబాద్ లో ‘స్నైడర్ ఎలక్ట్రిక్’ రూ.623 కోట్ల పెట్టుబడులు
Follow Us On: Sharechat


