కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేడు పల్నాడు జిల్లా కోటప్పకొండలోని (Kotappakonda) ప్రసిద్ధ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు. హెలీకాఫ్టర్లో కోటప్పకొండకు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు స్వాగతం చేప్పెందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పవన్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి సౌభాగ్యాల కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ రాకతో కోటప్పకొండ ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. కొత్తపాలెం-కోటప్పకొండ రోడ్డును పవన్ నేడు ప్రారంభించనున్నారు.
Read Also: లోయలో పడ్డ ఆర్మీ వెహికల్.. 10 మంది సైనికుల మృతి
Follow Us On: Sharechat


