కలం, వెబ్ డెస్క్: మేడారం మహా జాతరకు (Medaram Jatara) ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర వైభవంగా జరుగనుంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. ఈ రోజు నుంచి మేడారం భక్తులకు హెలీకాఫ్టర్ రైడ్స్ (Helicopter Rides) అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం ఇప్పటికే పడిగాపూర్ వద్ద హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.
లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతర (Medaram Jatara) విహంగ వీక్షణం అద్భుతంగా ఉంటుంది. ఈ దృశ్యాలను చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు జాతర విహంగ వీక్షణాన్ని అనుభూతి చెందే జాయ్ రైడ్‌కు ఒక్కొక్కరికి రూ.4,800 ఛార్జ్ చేయనున్నారు. ఇక హనుమకొండ నుంచి మేడారం జాతరను హెలీకాఫ్టర్‌లో చూసేందుకు రావడానికి, పోవడానికి కలిపి రూ.35,999 ఛార్జ్ర చేయనున్నారు. ఈనెల 31 వరకు హెలీకాఫ్టర్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు హెలీకాప్టర్ రైడ్స్ నడుస్తాయి. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్ లైన్స్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read Also: మేడారం భక్తులకు వాట్సాప్ సేవలు..!
Follow Us On: Pinterest


