epaper
Friday, January 16, 2026
spot_img
epaper

దేశాధ్యక్షురాలితో అసభ్య ప్రవర్తన..

సెలబ్రిటీలతో అసభ్య ప్రవర్తన తరుచూ వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా స్టార్ల విషయంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ దేశాధ్యక్షురాలితో ఓ పౌరుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తాగిన మైకంలో రెచ్చిపోయాడు. భద్రతా సిబ్బంది అడ్డుకున్నా వినలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెక్సికోలో ఈ ఘటన జరిగింది. మెక్సికో దేశాధ్యక్షురాలు(Mexican President) క్లాడియా షీన్‌బామ్‌ ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక మంది ప్రజలను ఆమె కలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకి, ముద్దు పెట్టుకొనే ప్రయత్నం చేశాడు. వీడియోల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అక్కడి నుంచి పంపించారు. క్లాడియా షీన్‌బామ్‌ తానే తన చేతితో అతడిని పక్కకు నెట్టినట్టు వీడియోలో కనిపిస్తోంది.

నెటిజన్లు ఈ ఘటనను భారీ భద్రతా వైఫల్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. “దేశాధ్యక్షురాలి(Mexican President)కే రక్షణ లేకుంటే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది?” అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భద్రతా వ్యవస్థ లోపాలను పరిశీలించమని డిమాండ్ చేస్తున్నారు. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

Read Also: హర్యాణాలో బ్రెజిల్ మోడల్‌కు ఓటు.. రాహుల్ సంచలన ఆరోపణ

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>