కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఏకైక కుమారుడు మురళి(Singer Janaki Son Murali) గురువారం మృతి చెందారు. ఈ విషయంపై ప్రముఖ గాయని చిత్ర (Chithra) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పోస్టు చేశారు. జనకి అమ్మ ఏకైక కుమారుడు మురళి అన్న ఈ రోజు ఉదయం మరణించారని తెలిపారు. ఎంతో ప్రేమగా చూసుకునే ఒక అన్నను కోల్పోయానని బాధపడ్డారు. జానకమ్మకు ఈ బాధను ఎదుర్కొనే శక్తిని దేవుడు ఇవ్వాలని ప్రార్థించారు. మురళి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమో పోస్టులో పేర్కొన్నారు. మురళి మృతితో జానకి కుటుంబం, స్నేహితులు, అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
Read Also: నంద్యాల జిల్లాలో లారీని ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి
Follow Us On: X(Twitter)


