కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ లో ఉన్న అధికారులకు ఐఏఎస్ ప్రమోషన్స్ (IAS Promotions) ఇచ్చేందుకు అధికారిక జాబితా ప్రకటించింది. రాష్ట్రం నుంచి మొత్తం 16 మంది అధికారులకు పదోన్నతి కల్పిస్తూ జనవరి 21న గెజిట్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీలకు అనుగుణంగా అధికారులకు పదోన్నతి కల్పించి తెలంగాణ IAS క్యాడర్‌లో నియమించనున్నారు.
ఈ నియామకాలు తెలంగాణ హైకోర్టులో మాధురి, బెన్ శలోమ్ దాఖలు చేసిన పిటిషన్ తీర్పుపై ఆధారపడి ఉంటాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో పదోన్నతి పొందిన అధికారులందరినీ ప్రొబేషన్‌పై తెలంగాణ IAS క్యాడర్‌లో అలాట్ చేస్తున్నారు. వీరి సీనియారిటీ, అలాట్‌మెంట్ ఇయర్ నిర్ణయం కోసం తెలంగాణ చీఫ్ సెక్రటరీ, అకౌంటెంట్ జనరల్ తెలంగాణ, ఇతర సంబంధిత అధికారులకు సూచనలు జారీ అయ్యాయి. అయితే, కేంద్ర సర్కార్ గతేడాది తెలంగాణ IAS క్యాడర్ సంఖ్య 208 నుంచి 218కి పెంచిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ప్రమోషన్లతో ఈ సంఖ్య 234 కి చేరింది. ఈ ప్రమోషన్లు తెలంగాణలో ఐఏఎస్ క్యాడర్ బలోపేతానికి దోహదపడతాయని అధికార వర్గాలు అంటున్నాయి.
2022, 2023, 2024 సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీల ఆధారంగా ఐఏఎస్ ప్రమోషన్స్ (IAS Promotions) కి సెలెక్ట్ అయిన అధికారుల జాబితా :
2022 సెలెక్ట్ లిస్ట్ :
- D. మధుసూదన్ నాయక్
- J.M. సత్యవాణి శంకర్
- G. భవాని శంకర్
- A. లింగస్వామి నాయక్
- A. నరసింహ రెడ్డి
- G. వీరా రెడ్డి
- G.V. శ్యామ్ ప్రసాద్ లాల్
- U. రాఘవరామ్ శర్మ
- P. చంద్రరాజ్
- G. ముకుంద రెడ్డి
- A. భాస్కర్ రావు
2023 సెలెక్ట్ లిస్ట్ :
- Y.V. గణేష్
- అబ్దుల్ హమీద్
- B. వెంకటేశ్వర్లు
2024 సెలెక్ట్ లిస్ట్ :
- N. ఖీమ్య నాయక్
- K. గంగాధర్


