కలం, సినిమా : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఇటీవల మతంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రం దుమారం రేపిన సంగతి తెలిసిందే. రెహమాన్ వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మండిపడ్డారు. తనకి ఆస్కార్ తీసుకొచ్చిన జయహో (Jai Ho) సాంగ్ తనది కాదని సుఖ్వీందర్ సింగ్ (Sukhwinder Sing) ఆ సాంగ్ కంపోజ్ చేయగా దానిని రెహమాన్ తీసుకున్నారని ఆర్జీవి (RGV) సంచలన కామెంట్స్ చేశారు. దీనితో ఆర్జీవి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసాయి.
తాజాగా ఆర్జీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. జయహో పాట విషయంలో నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏఆర్ రెహమాన్ గారు నేను కలిసిన అత్యుత్తమ సంగీత దర్శకుడు, అత్యంత మంచి మనసున్న వ్యక్తి. ఇతరుల కీర్తిని తీసుకునే వ్యక్తి ఆయన కాదని తెలిపారు. ఈ వివరణతో అనవసరమైన చర్చకు ముగింపు రావాలని ఆశిస్తున్నట్లు ఆర్జీవి (RGV) ట్వీట్ చేశారు.
Read Also: కెప్టెన్సీ ఒత్తిడేమీ లేదు.. పరుగులు వస్తాయ్
Follow Us On: Youtube


