కలం వెబ్ డెస్క్ : ఆయన ఒక ఎమ్మెల్యే.. కానీ, డెలివరీ బాయ్‌గా మారారు. ఇంటింటికీ బైక్‌పై ఆర్డర్లు అందజేస్తూ అందరినీ షాక్‌కు గురి చేశారు. ఎందుకు ఇలా చేశారా..? అని అందరూ మాట్లాడుకునేలా హాట్ టాపిక్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ (Bode Prasad) డెలివరీ బాయ్‌ల సమస్యలు తెలుసుకోవాలని అనుకున్నారు. రోజూ ఎండా, వానా, చలి అనే తేడా లేకుండా రాత్రింబవళ్లు డెలివరీ సేవలు అందిస్తున్న వారి కష్టాలను గుర్తించారు.
ఇటీవల వారి డిమాండ్ల కోసం గళం విప్పుతున్న గిగ్ వర్కర్లకు (Gig Workers) మద్దతుగా నిలిచారు. స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ డెలివరీ బాయ్‌గా మారి, డెలివరీ బాయ్ టీ షర్ట్ ధరించి తన బుల్లెట్‌పై వెళ్లి ఆర్డర్లు అందజేశారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి ఆర్డర్లు ఇవ్వడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే ప్రసాద్ (Bode Prasad) ఒక్క రోజు డెలివరీ బాయ్‌గా పని చేయడంపై గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ‘నో వర్క్ – నో పే’.. : ఏపీ స్పీకర్ సంచలన ప్రతిపాదన
Follow Us On: Instagram


