కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై (Municipal Elections) బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (Nitin Nabin) బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెల్చుకునే లక్ష్యంతో ముగ్గురు సీనియర్ నేతలను ఎలక్షన్ ఇన్‌చార్జి, కో-ఇన్‌చార్జిలుగా నియమించారు. వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆయన తరఫున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు.
మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శేలర్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రక్రియకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ఆయనకు సహాయకంగా ఉండేలా ఇద్దరు ఇన్‌చార్జిలు కూడా ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నారు. రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నమి, రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మ (జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్) కో-ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు.

Read Also: ముగ్గురు.. మూడు కేసులు.. పార్టీ కేడర్‌లో కన్‌ఫ్యూజన్
Follow Us On: Instagram


