కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రిహరీశ్‌రావు (Harish Rao) సిట్ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటలకు పైగా సుదీర్ఘంగా సిట్ (SIT) అధికారులు హరీశ్‌రావును విచారించారు. కాసేపట్లో హరీశ్‌రావు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసుతో (Phone Tapping Case) తనకు సంబంధం లేదని ఉదయం మీడియాతో హరీశ్‌రావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనను రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష పూరితంగా వేధిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
Read Also: రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఏకైక అజెండా : ఎర్రబెల్లి దయాకర్ రావు
Follow Us On: Instagram


