కలం, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇండొనేషియా టెన్నిస్ స్టార్ జానిస్ ట్జెన్ (Janice Tjen) అరుదైన చరిత్ర సృష్టించారు. సంచలన విజయం సాధించి ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజయం సాధించిన తొలి ఇండోనేషియన్ ప్లేయర్‌గా ఘనత సాధించారు. 28 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో మ్యాచ్ గెలిచిన తొలి ఇండోనేషియా క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. సీడింగ్ లేని ట్జెన్, కెనడా 22వ సీడ్ లెయ్లా ఫెర్నాండెజ్‌ను 6-2, 7-6 (7/1)తో ఓడించి మెల్‌బోర్న్‌లో రెండో రౌండ్‌కు చేరారు. గత ఏడాది ఇదే సమయానికి 413వ ర్యాంకులో ఉన్న ఆమె ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్‌లో 59వ స్థానంలో ఉన్నారు.
1998లో యాయుక్ బాసుకి తర్వాత గ్రాండ్ స్లామ్‌లో మ్యాచ్ గెలిచిన తొలి ఇండోనేషియా క్రీడాకారిణిగా ట్జెన్ (Janice Tjen) నిలిచారు. “ఇండోనేషియాకు ఇది చారిత్రక క్షణం. నా కుటుంబం ముందే ఈ విజయం సాధించడం మరింత ప్రత్యేకం,” అని ట్జెన్ అన్నారు. మ్యాచ్ ఆరంభంలోనే దూకుడుగా ఆడిన ట్జెన్, తొలి సెట్‌ను కేవలం 36 నిమిషాల్లో ముగించారు. రెండో సెట్‌లో ఆధిక్యం సాధించి, చివరకు టైబ్రేక్‌లో పైచేయి సాధించారు. విజయం సాధించిన అనంతరం ట్జెన్ సంబురాలు చేసుకున్నారు.
2025లో ట్జెన్ కెరీర్‌లో వేగంగా దూసుకెళ్లారు. యూఎస్ ఓపెన్‌లో వెరోనికా కుడెర్మెటోవాపై సంచలన విజయం సాధించారు. చెన్నైలో టైటిల్ గెలిచి, 2002 తర్వాత డబ్ల్యుటీఏ టూర్ సింగిల్స్ కిరీటం అందుకున్న తొలి ఇండోనేషియా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు. మెల్‌బోర్న్‌లో ఇండోనేషియా అభిమానుల నినాదాలు తనకు ఇంట్లో ఉన్న అనుభూతిని ఇచ్చాయని ట్జెన్ తెలిపారు. “నన్ను ఆదరించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇది ప్రత్యేకమైన రోజు,” అని ఆమె చెప్పారు.
Read Also: టీమిండియా ఓటమికి కారణమిదే: అజింక్య రహానే
Follow Us On: Sharechat


