కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఉస్మాన్ నగర్ లోని హోమ్ ట్రీ అపార్ట్ మెంట్ లో శ్యామ్ పంచాలు (28), అతుల్ సహానీ, మిథ్లేష్ కుమార్ కూలిపని చేసుకుంటూ నివసిస్తున్నారు. అందరూ కలిసి భోజనం చేస్తున్న టైమ్ లో అతుల్ సహానీ అన్నం ప్లేటులో శ్యామ్ చేతులు కడిగాడు. ఈ విషయం మీద మాట మాట పెరిగి శ్యామ్ పంచాలుపై అతుల్ సహానీ దాడి చేశాడు. దాడిలో శ్యామ్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కొల్లూరు పోలీసులు.


