కలం వెబ్ డెస్క్ : ముంబయిలో (Mumbai) ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో జగిత్యాల (Jagtial) జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది (Bus Fire). వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ వీనస్‌కు చెందిన స్లీపర్ బస్సు సోమవారం రాత్రి జిల్లా కేంద్రం నుంచి ముంబయికి బయలుదేరింది. మంగళవారం ముంబయిలోని మలాడ్ వెస్ట్‌కు చేరుకోగానే రోడ్డుపై ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దించేశాడు. అందరూ చూస్తుండగానే బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని డ్రైవర్ చెప్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. సకాలంలో అంతా బస్సు దిగడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Read Also: ఇన్వెస్టర్లకు షాక్.. బేర్ మన్న స్టాక్ మార్కెట్లు!
Follow Us On : WhatsApp


