కలం వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. రెండు గంటలుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ కొనసాగుతోంది. హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, హరీశ్ అడ్వకేట్ కూడా స్టేషన్‌కు వచ్చారు. కానీ, అధికారులు హరీశ్ ఒక్కరినే లోపలికి అనుమతించారు. స్టేషన్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం హరీశ్‌ను విచారిస్తోంది. ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ ఆధారంగా హరీశ్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది.
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తనకు సిట్ నోటీసులు పంపించారని హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేని కేసులో (Phone Tapping Case) ఇరికిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. సిట్ విచారణతో అధికారులు ఏం తేలుస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also: కేరళ బస్సు ఘటన.. మహిళపై ఎఫ్ఐఆర్
Follow Us On: Sharechat


