కలం మెదక్ బ్యూరో: బిల్లులు రాలేదని ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల డైనింగ్ హాల్‌కు తాళం వేశాడు. ఈ ఘటన మెదక్ (Medak) జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌లో జరిగింది. శంకర్ అనే కాంట్రాక్టర్ మూడేళ్ల క్రితం జడ్పీ హైస్కూల్‌లో రూ. 10 లక్షల వ్యయంతో డైనింగ్ హాల్ నిర్మించాడు. బిల్లుల కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నేటికి మంజూరు కాలేదు. దీంతో డైనింగ్ హాల్‌కు తాళం వేశాడు. విద్యార్థులు స్కూల్ వరండాలో భోజనాలు చేయాల్సి వచ్చింది. భార్య ఒంటిపై ఉన్న నగలను తాకట్టుపెట్టి పనులు చేశానని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Also: మొబైల్ కు బానిసైన యువతి.. తల్లి మందలించడంతో ఆత్మహత్య
Follow Us On: X(Twitter)


