కలం వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సింగరేణిలో (Singareni) బొగ్గు గనుల అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మంగళవారం ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) లేఖ రాశారు. ఈ లేఖలో సింగరేణిలో 2024 తర్వాత తీసుకున్న టెండర్లపై సీబీఐ (CBI) దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెగటివ్ రేట్లలో ఇచ్చిన టెండర్లను రద్దు చేయడం, కొత్త విధానాలతో టెండర్లను ఎక్కువ రేట్లలో మళ్లీ ఇవ్వడం సంస్థకు భారీ ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
సింగరేణిలో ప్రవేశపెట్టిన “సైట్ విజిట్ సర్టిఫికేట్” విధానం గతంలో ఎప్పుడూ లేదని హరీష్ తెలిపారు. కోల్ ఇండియా లిమిటెడ్, వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ వంటి ఇతర ప్రభుత్వ ఖనిజ సంస్థల్లో కూడా దీన్ని పాటించరని వెల్లడించారు. ఈ విధానంతో గతంలో నెగటివ్ రేట్లలో ఇచ్చిన టెండర్లు రద్దు చేయబడి, కొత్త విధానంతో ఎక్కువ ధరల వద్ద మళ్లీ ఇచ్చి సింగరేణికి పెద్ద నష్టం కలిగిందని గుర్తు చేశారు. అలాగే సింగరేణిలో పూర్వం ఐవోసీఎల్ నుంచి అధిక మొత్తంలో డీజిల్ సరఫరా జరిగేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను నిలిపివేసి కాంట్రాక్టర్లకు అప్పజెప్పారని తెలిపారు. దీనివల్ల ప్రాజెక్ట్ ఖర్చులు పెరిగి, అదనపు జీఎస్టీ భారం పడుతోందని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
సింగరేని క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ బోర్డులో కేంద్రం నియమించిన డైరెక్టర్లు, పబ్లిక్ ఇంటరెస్ట్ రక్షణ బాధ్యత అత్యంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఈ సమస్యలపై మౌనంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాలు బోర్డు ముందుకు వచ్చాయా? అబ్జెక్షన్లు నమోదు అయ్యాయా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. సింగరేణిలో రెండేళ్లుగా రెగ్యులర్ సీఎండీ లేకుండా ఇన్ చార్జ్ తోనే నిర్వహణ సాగుతోందని, దీంతో సంస్థలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. సింగరేణిలో 2024 తర్వాత తీసుకున్న అన్ని టెండర్లు, విధాన నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని, సంస్థలో అవినీతి జరగకుండా చూడాలని రక్షించాలని హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
Read Also: జాతీయగీతం తెచ్చిన తంటా.. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
Follow Us On: Youtube


