epaper
Monday, January 19, 2026
spot_img
epaper

అదరగొట్టిన నవీన్ పోలిశెట్టి సినిమా.. 5 రోజుల్లోనే

కలం, సినిమా :  టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించిన లేటెస్ట్ మూవీ “అనగనగా ఒక రాజు” (Anaganaga Oka Raju). దర్శకుడు మారి (Maari) ఈ సినిమాను ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ”అనగనగా ఒక రాజు” మూవీ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన కేవలం 5 రోజుల్లోనే నవీన్ సినిమా ఈ ఘనత సాధించింది. నవీన్ కెరీర్‌లో 100 కోట్లు సాధించిన తొలి సినిమాగా ” అనగనగా ఒక రాజు” నిలిచింది. ఈ సినిమాలో నవీన్ సరసన క్యూట్ బ్యూటీ మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి పెయిర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>