epaper
Thursday, March 5, 2026
epaper

రాష్ట్ర సర్కార్ సరికొత్త రికార్డు!

కలం, తెలంగాణ బ్యూరో: ముందే ప్రకటించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో (Medaram) కేబినెట్ సమావేశం (Telangana Cabinet) నిర్వహించింది. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు మేడారానికి చేరుకున్నారు. సాయంత్రం ఇక్కడి హరితా హోటల్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ  అయింది. దావోస్ పర్యటనకు వెళ్లడంతో మంత్రి శ్రీధర్ బాబు మినహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. వివిధ అంశాలపై ఇందులో చర్చించారు.

సెక్రటేరియెట్ బయటా.. అదీ రాష్ట్ర రాజధానికి అవతల కేబినెట్ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాగా, సోమవారం ఉదయం మేడారం గద్దెలను దర్శించుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా దావోస్ కు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు.

Telangana Cabinet
Telangana Cabinet

Read Also: రంగారెడ్డిని సగం ఎంఐఎంకు అప్పజెప్పేలా కుట్ర : ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!