కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పజెప్పేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Vishweshwar Reddy) సంచలన ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా మున్సిపాలిటీల విభజన చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర ఆఫీస్ లో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి చుట్టు పక్కల ఉన్న గ్రామాలను చార్మినార్ లో కలపడం వెనక పెద్ద కుట్ర దాగుందని చెప్పుకొచ్చారు.
పాతబస్తీలో ఎవరూ కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు కట్టరని.. అలాంటి వారితో రంగారెడ్డి ప్రజలను ఎందుకు కలుపుతున్నారంటూ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి సంపద మొత్తం గతంలో కేసీఆర్ గల్లాపెట్టెలోకి వెళ్లిందని.. ఇప్పుడు ఎంఐఎం ఇలాకాలోకి వెళ్తుందని చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేయొద్దని.. చార్మినార్ లో రంగారెడ్డిని కలిపితే ఇక్కడి ప్రజల జీవితాలు ఆగమవుతాయంటూ చెప్పుకొచ్చారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

Read Also: రాష్ట్ర సర్కార్ సరికొత్త రికార్డు!
Follow Us On : WhatsApp


